![]() |
![]() |
.webp)
పటాస్ ఫైమా బుల్లితెర మీద ప్రసారమయ్యే కొన్ని షోస్ లో చిచ్చుబుడ్డిలా పేలుతూ ఉంటుంది. లేడీ కమెడియన్స్ లో ఫైమాకు ఆడియన్స్ స్పెషల్ ప్లేస్ కూడా దక్కింది. అలాంటి ఫైమా "నన్ను ప్రశ్నలు అడగండి" అని పోస్ట్ చేసేసరికి నెటిజన్స్ అడగడం మొదలు పెట్టారు. ఒక నెటిజన్ ఐతే "పల్లవి ప్రశాంత్ ని పెళ్లి చేసుకో.. అన్న చాలా మంచోడు" అనే ఒక సలహా చెప్పేసరికి " ఏమయ్యింది చెల్లెమ్మ నీకు. ప్రశాంత్ నాకు తమ్ముడవుతాడు" అంటూ కామెంట్ పెట్టింది ఫైమా. "మీరు స్టార్ మా పరివారానికి రావడం లేదు ..ఏమయ్యింది నాకు క్లారిటీ కావాలి" అని అడిగారు "నాక్కూడా తెలీదు...గ్యాప్ వచ్చింది. "ఏంటక్కా మీ రాకుమారుడిని వెతుకుతున్నావా" అంటే "హా తప్పిపోయాడు" అని చెప్పింది.
"మాల్ కి ట్రెడిషన్ గా వెళ్ళావేంటి అక్కా.."అనడంతో " ఫస్ట్ టైం ట్రై చేశా" అని చెప్పింది. "చాక్లెట్ డేని సెలెబ్రేట్ చేసుకున్నారా" అనే " ఆ డే లేదు మనకి" అంది. ఇక ఫైమా కార్ చాలా నచ్చిందని ఎప్పుడు కొన్నావ్ అని అడిగేసరికి మూడు నెలలయ్యింది అని తనకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చు అని చెప్పింది. అలాగే ఫైమా వేసుకున్న డ్రెస్ కూడా బాగుందని కామెంట్స్ చేసారు. ఫైమా ఆ డ్రెస్ లో కార్ డ్రైవింగ్ చేసుకుని వెళ్తూ "ప్రేమ పరిచయమే" అనే సాంగ్ కి రీల్ చేసి తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఇక ఫైమా కార్ డ్రైవింగ్ చేయడం చూసిన నెటిజన్స్ అంతా షాకయ్యారు. "మీకు కార్ డ్రైవింగ్ వచ్చా, నిజంగానే డ్రైవింగ్ చేస్తున్నారా..గేర్లు మార్చకుండా ఎలా డ్రైవ్ చేస్తున్నారు..ఇల్లు కొన్నావ్, కార్ కొన్నావ్ సూపర్ రా...కార్ నడపాలి అంటే డ్రైవింగ్ సీట్ లో కూర్చుని నడపాలి పక్క సీట్ లో కూర్చుని కాదు...నాకు ఇష్టమైన కామెడీ స్టార్, లేడీ డాన్సర్..ఫైమా అక్క చిన్నగా కార్ ఐతే నేర్చుకున్నావు..నెక్స్ట్ ఏరోప్లేనే..." అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |